యథేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జా
● టీడీపీ నాయకుల నిర్వాకం
● రెవెన్యూ అధికారులను
లెక్క చేయని వైనం
వింజమూరు(ఉదయగిరి): మండలంలోని శంఖవరంలో సర్వే నంబర్లు 208, 209లో సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు అఽధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం యంత్రాలతో చెట్లు తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. దీనిపై పలువురు గ్రామస్తులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీఆర్‌ఏ ఆక్రమణదారులతో మాట్లాడి పనులు ఆపించారు. కొంతసేపటి తర్వాత మళ్లీ చదును చేసే పనులను ప్రారంభించారు. మళ్లీ స్థానికులు తహసీల్దార్ షేక్ హమీద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే వీఆర్వో, ఆర్‌ఐను ఘటనా స్థలం వద్దకు పంపి పనులు నిలిపేయించారు. గ్రామానికి అతి సమీపంలో జగనన్న లేఅవుట్ దగ్గరగా ఉన్న ఈ ప్రభుత్వ భూమి ఎంతో విలువైంది కావడంతో ఆక్రమించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దీని విలువ సుమారు రూ.5 కోట్లు ఉంటుందని గ్రామస్తులు చెబుతు న్నారు.
అప్పట్లో స్వాధీనం
ఈ భూమిని పదేళ్ల క్రితం కొందరు గ్రామస్తులు ఆక్రమించి సాగు చేశారు. 2023లో వివాదం నెలకొని రెండు వర్గాలు మధ్య గొడవలు జరగడంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ భూమిలోకి ప్రవేశించకుండా బోర్డు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు భూమిని ఆక్రమించాలని చూస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ షేక్ హమీద్‌ను వివరణ కోరగా మంగళవారం బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment