ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ..
‘జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. యాజమాన్యాలు నిబంధనల మేరకు బస్సులు నడపకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి’ అని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ నేతలు అన్నారు. జిల్లా అధ్యక్షుడు ముంగమూరు అశ్రిత్‌రెడ్డి, నేతలు స్కూల్ బస్సుల ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు చెందిన సుమారు రెండు వేలకు పైగా బస్సులున్నాయన్నారు. గడిచిన నాలుగు నెలల వ్యవధిలో పలుచోట్ల ప్రమాదాలు జరిగి విద్యార్థులు గాయపడ్డారన్నారు. కారణాలను లోతుగా పరిశీలించాలని, వాహనాల కండీషన్‌ను తనిఖీ చేయాలని కోరారు. బస్సు వేగం 40 కిలోమీటర్లకు మించకుండా చూడాలన్నారు. విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు తౌఫిక్, చంద్ర, లిఖిత్, ఉస్మాన్, సిద్ధా, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment