కసుమూరులో కార్డన్ సెర్చ్
● ఏడు మోటార్‌బైక్‌ల స్వాధీనం
● పోలీసుల అదుపులో
ఇద్దరు వ్యక్తులు
వెంకటాచలం: నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్వంలో మండలంలోని కసుమూరులో సోమవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్‌ను నిర్వహించారు. సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది మొత్తం 130 మందికి పైగా కసుమూరు పంచాయతీ పరిధిలోని దర్గా సెంటర్, ఎస్టీ కాలనీ, పెద్దూరు, తిప్ప చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 300 నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సరైన ధ్రువీకరణ పత్రాల్లేని ఏడు మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకుని వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రౌడీషీటర్ల ఇళ్లకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. అద్దె గృహాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. షేక్ నౌషాద్‌కు చెందిన గృహాల్లో రెండు జంటలను అదుపులోకి తీసుకుని, నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment