వసతులు కల్పించాలి
ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్‌కు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని, వారికి తగిన భద్రత, వసతులు కల్పించాలని మండల బీజేపీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు అలల తాకిడికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని, వెంటనే భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. బీచ్ పరిసర ప్రాంతాల్లో మహిళలకు రక్షణ లేదని, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వెంటనే గస్తీని ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్ గాంధీ, సతీష్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు, చేవూరు వెంకట్రావు, చేవూరు భాస్కర్‌రావు, మురళి, వాకాటి ప్రసాద్, శరత్, నెల్లూరు వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment