ఒక్క అర్జీ కూడా రాలేదు
వరికుంటపాడు: ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక ప్రజాదరణ కోల్పోయింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఒక్కరంటే.. ఒక్క అర్జీదారుడు కూడా హాజరు కాలేదంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సోమవారం తహసీల్దారు కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ‘సాక్షి’ పరిశీలించింది. ఉదయం 10 గంటలకు జూనియర్ సహాయకులు రాగా, 10.30 గంటల వరకు అధికారులు, సిబ్బంది హాజరుకాలేదు. 10.42 గంటలకు డీటీ వచ్చారు. 10.25 గంటలకు ఆర్‌అండ్‌బీ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్, 10.35 గంటలకు హాస్టల్ వార్డెన్ హాజరయ్యి సంతకాలు చేసి కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. తహసీల్దార్ హేమంత్‌కుమార్ కోర్టు పనిపై అమరావతి వెళ్లినట్టు డీటీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment