ఎన్‌పీకుంట: మండల కేంద్రంలోని నడింబోటు కొండపై అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, స్థానిక సింగిల్ విండో అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ఈటె రాము, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కొత్త రంగారెడ్డి, సర్పంచ్ అంజినమ్మ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ నిర్మాణంపై సంబంధిత అధికారులతో మంత్రి ఆరా తీశారు. మండల కేంద్రంలో ఏర్పాటైన సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా విడుదలైన రూ.20 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు జగదీశ్వరరెడ్డి వివరించారు. దీంతో మరో రూ.30 లక్షలు అందజేస్తామని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రిని గురుస్వామి రఘునాథ, అయ్యప్ప మాలధారులు సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment