‘అపార్’ వేగవంతం చేయండి
ప్రశాంతి నిలయం: ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆధార్ తరహాలో అపార్ ఐడీ జనరేషన్‌కు వివరాల నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్‌హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌తో కలసి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంఈఓలతో అపార్ విధివిధానాలపై కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు సక్రమంగా ఉన్న విద్యార్థులకు సంబంధించి అపార్ జనరేషన్ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ కారణాల వల్ల రిజిస్ట్రేషన్ కాని వాటిని కేటగిరీల వారిగా విభజించి పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మొత్తం 1,67,082 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో 1,49,770 మంది అపార్ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. మిగిలినవి పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో అర్డీఓ సువర్ణ, డీఈఓ క్రిష్టప్ప, డీఐఈఓ రఘునాథరెడ్డి, ఎంఈఓలు జయచంద్ర, ఆనంద్‌బాబు, సంపూర్ణ, డీపీఓ సమత, సచివాలయ నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే చర్యలు..
పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయకపోతే డీఈఈలు, ఏఈఈలపై చర్యలు తప్పనవి కలెక్టర్ టీఎస్ చేతన్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో డ్వామా, పంచాయతీరాజ్, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. డీఈలు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాలన్నారు. పుట్టపర్తి, మడకశిర క్లస్టర్లలో పంచాయతీ రాజ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అధికారులు లక్ష్యాలను వంద శాతం అధిగమించాలని ఆదేశించారు. సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేస్తామని హెచ్చరించారు. బ్లాక్ ప్లాంటేషన్, హార్టికల్చర్ ప్లాంటేషన్ పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్‌ఈ మురళీకృష్ణ, పట్టుపరిశ్రమ శాఖ జేడీ పద్మావతి, పశుసంవర్దక శాఖ జేడీ శుభదాస్, పలువురు డీఈఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment