తాడిమర్రిలో ఎట్టకేలకు మద్యం దుకాణం ప్రారంభం
తాడిమర్రి: మండల కేంద్రం తాడిమర్రిలో కూటమి పార్టీల నాయకుల అడ్డంకులు దాటుకుని కోర్టు ఆదేశాలతో పోలీసులు, ఎకై ్సజ్ అధికారుల సమక్షంలో ఎట్టకేలకు మద్యం దుకాణం ప్రారంభమైంది. మద్యం దుకాణాల నిర్వహణ కోసం ప్రభుత్వం అక్టోబర్ 9న లాటరీ తీసింది. తాడిమర్రి షాపు నంబర్ 16ను హైదరాబాద్‌కు చెందిన కొండపల్లి గణేష్ దక్కించుకున్నాడు. అతని నుంచి దుకాణం లీజుకు తీసుకోవాలని టీడీపీ, బీజేపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు తాడిమర్రికి చెందిన బీజేపీ నాయకుడు అతనితో లీజుకు మాట్లాడుకుని 24వ తేదీన దుకాణం ప్రారంభోత్సవానికి పూనుకున్నాడు. దుకాణం తమకు కాకుండా బీజేపీ నాయకులు ఎలా ఓపెన్ చేస్తారని టీడీపీ నాయకులు దాడికి దిగారు. దుకాణంలో సరుకు దింపకుండా అడ్డుకున్నారు. దీంతో దుకాణం ప్రారంభానికి ప్రత్యేక రక్షణ కల్పించాలని కొండపల్లి గణేష్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు 50 రోజుల తర్వాత ఎకై ్సజ్ సీఐ చంద్రమణి, ముదిగుబ్బ రూరల్ సీఐ శ్యామరావు, పోలీసుల సమక్షంలో మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దుకాణం ప్రారభించారు. గతంలో దుకాణానికి బీజేపీ నాయకుడు ఒక తాళం, టీడీపీ నాయకులు మరో తాళం వేశారు. ఆ తాళం చెవులు లేకపోవడంతో బద్దలుకొట్టి మరీ షాపు తెరిచి, మద్యం విక్రయాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కృష్ణవేణి, ఏఎస్‌ఐలు వన్నప్ప, సూర్యనారాయణ రాజు, హెచ్‌సీలు చంద్రశేఖర్‌రెడ్డి, సత్యనారాయణ, నాగరాజు, ఎకై ్సజ్ హెచ్‌సీలు రాజ్‌గోపాల్, వెంకటేశ్వర్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.
రెవెన్యూ సమస్యల
పరిష్కారమే ధ్యేయం
లేపాక్షి: రెవెన్యూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. లేపాక్షి మండలం శిరివరం సచివాలయం ఆవరణలో జరిగిన రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తుల నుంచి పలు అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో శ్మశానవాటిక సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. గ్రామపెద్దలు, తహసీల్దార్ సమక్షంలో ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో గుర్తించి శ్మశానవాటికకు కేటాయించేలా ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సివిల్ సమస్యలు ఉంటే గ్రామ పెద్దల ద్వారా లేదా సివిల్ కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించారు. చెరువు కాలువలు, చెరువు గర్భాలు, కాలువ గట్లకు పట్టాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. రీసర్వే, అడంగల్‌లో చేర్పులు, మార్పులు, సర్వే నంబర్లు తప్పుగా వేయడం, ఆర్‌ఎస్‌ఆర్ రికార్డులు, భూమి కొనుగోలు, విక్రయాలు తదుపరి పేర్ల మార్పిడి, ఆక్రమణలు, నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన వాటి వివరాలు తెలుసుకోవడానికి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నేత్రావతి, మండల స్పెషల్ ఆఫీసర్, ఏపీఎంఐపీ పీడి సుదర్శన్, ఆర్డీఓ ఆనందకుమార్, తహసీల్దార్ సౌజన్య లక్ష్మి, ఎంపీడీఓ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment