ప్రశాంతి నిలయం: తల్లిని పూజించే ప్రతి మనిషీ సర్వోన్నతులవుతారన్న సందేశాన్నిస్తూ చిన్నారులు నిర్వహించిన ‘మాతృదేవోభవ’ నృత్యరూపకం భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగం గుంటూరు జిల్లా సత్యసాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. మంగళవారం సాయంత్రం ప్రశాంతి నిలయంలోని సత్యసాయి సన్నిధిలో గుంటూరు జిల్లా బాలవికాస్ చిన్నారులు ‘మాతృదేవోభ’ పేరుతో సంగీత నృత్యరూపకం ప్రదర్శించారు. వినాయకుడు, శ్రీకృష్ణుడు, సత్యసాయి తల్లిని సేవించి, ప్రేమించి, గౌరవించి ఆదర్శ పురుషులుగా నిలిచిన తీరును చక్కగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment