పోలీసే మట్టి దొంగ!
చిలమత్తూరు: దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీసు అధికారే దొంగగా మారాడు! ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అటాచ్మెంట్ చేసిన భూముల్లో అక్రమంగా మట్టి తవ్వుకుని తన కోళ్ల ఫాం బేస్మెంట్కు వాడుకుంటున్నాడు. పట్టపగలే సదరు ఖాకీ వందలకొద్ది టిప్పర్ల మట్టి తరలించుకుపోతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇక తమ ఖాకీనే కదా అని పోలీసులూ అభిమానం చూపడంతో సదరు పోలీసు సారు పని పూర్తి చేశారు.
ఇక్కడ పనిచేసి... భూములు కొని..
ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గంలో ఎస్ఐగా ఉన్న సదరు అధికారి గతంలో చిలమత్తూరులో పనిచేశారు. ఆ సమయంలో ఇక్కడ దాదాపు మూడు ఎకరాల భూమి భార్య పేరు మీద కొన్నారు. ఇప్పుడు అక్కడ కోళ్ల ఫాం నిర్మిస్తున్నారు. అయితే ఈ భూమి ఏటవాలుగా ఉండటంతో లెవలింగ్ కోసం కావాల్సిన మట్టిని ఏకంగా లేపాక్షి హబ్ భూముల్లోంచి అక్రమంగా తోలుకున్నారు. నాలుగురోజులుగా ఈ తంతు సాగుతున్నా ఒక్కరూ అడ్డుచెప్పలేదు. గతంలోనే ఇలా లేపాక్షి హబ్ భూముల్లో మట్టి తరలించినందుకు ఓ రియల్టర్కు మైనింగ్ శాఖ రూ.2 కోట్ల మేర జరిమానా విధించింది. మరి ఎస్ఐ మట్టి దందాను ఎందుకు పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మనోడే కదా అనీ...
గత ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన భంగపడిన సదరు ఎస్ఐ... ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ అమాయకులపై ప్రతాపం చూపుతున్నారు. అందువల్లే చిలమత్తూరులో అధికార పార్టీ నేతలు కూడా ఖాకీ మట్టిదందాకు అడ్డుచెప్పలేదని తెలుస్తోంది. కానీ ఈడీ అటాచ్ చేసిన భూముల్లోని మట్టిని అక్రమంగా తరలించడంపై కోర్టు ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెబుతారో చూడాలి మరి. చట్టాన్ని ఉల్లంఘించి మట్టిదందా చేసిన ఖాకీపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా...మనోడే కదా అని వెనకేసుకువస్తారా చూడాలి మరి.
లేపాక్షి హబ్ భూముల్లో
అక్రమంగా మట్టి తవ్వకం
తాను నిర్మిస్తున్న కోళ్ల ఫాం కోసం
వందల టిప్పర్లతో రవాణా
ఈడీ అటాచ్ చేసిన భూముల్లో
తవ్వకాలపై సర్వత్రా విస్మయం
అన్నీ తెలిసీ కళ్లుమూసుకున్న
రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు
Comments
Please login to add a commentAdd a comment