విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత
● కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి టౌన్: సత్యసాయి విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ సూచించారు. శనివారం సత్యసాయి విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. చైర్మన్ హోదాలో సమావేశానికి హాజరైన కలెక్టర్ భద్రతపై పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సత్యసాయి బాబా మహాసమాఽధి దర్శనార్థం వీఐపీలు, వీవీఐపీలు చాలామంది వాయుమార్గంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారని, అలాంటి సమయంలో భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకు అధికార యంత్రాంగానికి విమానాశ్రయం నిర్వాహకుల సహకారం ఉండాలన్నారు. రానున్న రోజుల్లో భద్రతా ప్రమాణాలు కూడా పెంచాలన్నారు. అనంతరం విమానాశ్రయం నిర్వాహకులు భద్రతపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, విమానాశ్రయం డైరెక్టర్ సాయినాథరెడ్డి, అడ్మిన్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ సువర్ణ, డీఎస్పీ విజయ్‌కుమార్, తహసీల్దార్ అనుపమ, మున్సిపల్ కమిషనర్ ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment