బాలయ్య పీఏ మోసగాడు
● అతనితో ఎవరూ ఆర్థిక లావాదేవీలు
జరపకండి
● ఉద్యోగం కోసం తీసుకున్న డబ్బులో రూ.50 వేలు తిరిగి ఇవ్వలేదు
● సామాజిక మాధ్యమాల్లో
బాధితుడి ఆవేదన
హిందూపురం: ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ చంద్రమోహన్‌పై అతనికి కొడుకు వరుసయ్యే యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు శనివారం స్థానికంగా వైరల్‌గా మారాయి.
యువకుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు ఇలా..
‘‘నా పేరు మితిలేష్ యాదవ్, నేను మోతుకపల్లిలో నివాసం ఉంటున్నా. 220 కేవీ సబ్ స్టేషన్‌లో ఒక ఉద్యోగం కోసం ఎమ్మెల్యే బాలయ్య పీఏ చంద్రమోహన్ (టీడీపీ పార్లమెంటరీ మీడియా కోఆర్డినేటర్ )ను సంప్రదించాను. ఆయన నాకు వరుసకు చిన్నాన్న అవుతారు. అయినా ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1.50 లక్షల డిమాండ్ చేశాడు. డబ్బులిచ్చాక ఎమ్మెల్యే బాలకృష్ణ సిఫారసు లేఖ ఇచ్చారు. అయితే ఆ లేఖను తీసుకువెళ్లి అధికారులకు ఇవ్వగా...సబ్‌స్టేషన్ పెనుకొండ నియోజకవర్గంలో ఉందని, అందువల్ల ఆ లేఖను పరిగణనలోకి తీసుకోలేమన్నారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ పీఏ చంద్రమోహన్‌కు తెలిపి..నా డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరాను. తొలుత అందుకు అతను నిరాకరించాడు. ఆ తర్వాత కుటుంబ పెద్దలతో సంప్రదించగా రూ.లక్ష ఇచ్చాడు. మిగతా రూ.50 వేలు ఇవ్వాలని కోరగా...రూ.లక్ష ఇచ్చినపుడు తీసుకున్న ఫొటోను చూసి అప్పుడే మొత్తం ఇచ్చేశానని అబద్ధం ఆడుతున్నాడు. నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. బంధువైన నన్నే మోసం చేశాడు. అందువల్ల అతనితో ఆర్థిక లావాదేవీలు చేసి ఎవరూ మోసపోకండి’’
ధర్మవరం వాసి
తమిళనాడులో మృతి
● అయ్యప్ప దర్శనానికి వెళ్లి
తిరిగి వస్తుండగా గుండెపోటు
● మృతుడు చార్టెడ్ అకౌంటెంట్
ధర్మవరం అర్బన్: పట్టణానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గట్టు వీరాంజనేయులు(44) అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన గట్టు వీరాంజనేయులు చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం స్నేహితులతో కలిసి శబరిమల వెళ్లాడు. అయ్యప్పస్వామి దర్శనం అనంతరం శుక్రవారం తిరిగి ధర్మవరానికి కారులో బయలుదేరాడు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ సమీపంలోకి రాగానే ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో స్నేహితులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. శనివారం ఉదయం వీరాంజనేయులు మృతదేహాన్ని ధర్మవరానికి తీసుకువచ్చారు. మృతునికి భార్య లీలతో పాటు కుమారులు హర్షవర్ధన్, కార్తీక్ ఉన్నారు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య, పిల్లలు బోరున విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment