భార్య ఎడబాటు తట్టుకోలేక భర్త ఆత్మహత్య
పెద్దపప్పూరు: భార్య మృతితో ఎడబాటును తట్టుకోలేక చివరకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు... పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లికి చెందిన నారాయణస్వామి (38), లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో 28 రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగి లక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి దిగాలుగా ఉన్న నారాయణస్వామి శనివారం అర్ధరాత్రి కలుపు నివారణ మందు తాగాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు చికిత్సకు స్పందించక ఆదివారం సాయంత్రం ఆయన మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
అదనపు కట్న వేధింపులపై
కేసు నమోదు
గార్లదిన్నె: అదనపు కట్నం కోసం భార్యను వేధించిన భర్త, ఆయన తండ్రిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. వివరాలు.. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన కావ్యశ్రీకి ఏడాది క్రితం కళ్యాణదుర్గం షీబావి నివాసి వన్నూరుస్వామితో వివాహమైంది. ఇటీవల అదనపు కట్నం కోసం కావ్యశ్రీని భర్తతో పాటు మామ కుళ్లాయప్ప వేధిస్తుండడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని యువకుడి
ఆత్మహత్య
తాడిపత్రి రూరల్: మండలంలోని కొమలి సమీపంలో రైలు కింద పడి ఓ గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో కో–పైలెట్ సమాచారంతో ఆర్‌పీఎఫ్ హెచ్‌సీ వరప్రసాద్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో తాడిపత్రిలోని రైల్వే స్టేషన్ నుంచి గుత్తికి వెళ్లే రైలుకు కొనుగోలు చేసిన టికెట్ లభ్యమైంది. అంతకు మించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. గుర్తు తెలియని యువకుడి ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment