8వ వేతన సంఘం సమస్యపై పార్లమెంట్‌లో చర్చించండి
అనంతపురం సిటీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎనిమిదో వేతన సవరణ సమస్యను పరిష్కరించేలా ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి, బిల్లు పాస్ అయ్యేలా చొరవ తీసుకోవాలని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్(ఏఐజీడీఎస్‌యూ) అనంతపురం డివిజన్ కార్యదర్శి పి.కృష్ణయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు జిల్లా పర్యటనకు ఆదివారం విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కలసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వేతనాలు, పెన్షన్ల సవరణ ప్రక్రియ ప్రతి పదేళ్లకు ఒకసారి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదన్నారు. వేతన సవరణకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండడంతో ఇప్పటి నుంచే ఆ ప్రక్రియ మొదలు పెట్టేలా చూడాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని అనంతరం విలేకరులకు కృష్ణయ్య వివరించారు.
కేంద్ర రైల్వే సహాయ మంత్రికి తపాలా ఉద్యోగుల వినతి
Comments
Please login to add a commentAdd a comment