చిన్నారిపై అత్యాచారయత్నం
పోక్సో కేసు నమోదు
పరిగి: అభం శుభం తెలియని చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామంలో నివాసముంటున్న ఉప్పర సునీల్‌కుమార్ (27) సమీపంలోని ఏడేళ్ల బాలికపై కన్నేశాడు. ఆదివారం ఇంట్లో బాలిక ఒంటరిగా ఆడుకోవడాన్ని గమనించాడు. ఇదే అదనుగా భావించిన సునీల్‌కుమార్ బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ లోపు కుటుంబ సభ్యులు రావడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సునీల్‌కుమార్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.
బైక్‌ను ఢీకొన్న ఆవు
●వివాహిత దుర్మరణం
పెనుకొండ: ఆవు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొన్న ఘటనలో వెనుక కూర్చున్న వివాహిత తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. వివరాలిలా ఉన్నాయి. పెనుకొండ పట్టణంలోని మారుతినగర్‌కు చెందిన ఆదిలక్ష్మమ్మ (41) తన భర్త రామాంజనేయులుతో కలిసి ఆదివారం కర్ణాటకలోని నాగలమడక సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వెళ్లారు. అక్కడ షష్టి పూజ ముగించుకుని తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు. పెనుకొండ సమీపాన జర్నలిస్టు కాలనీ వద్ద వీరి ద్విచక్రవాహనాన్ని ఆవు బలంగా ఢీకొంది. దంపతులిద్దరూ ఎగిరి రోడ్డుపై పడ్డారు. తల, ముక్కు, చెవుల్లోంచి తీవ్ర రక్తస్రావమై ఆదిలక్ష్మమ్మ మృతి చెందారు. భర్త స్వల్ప గాయాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా కుమారులిద్దరూ అయ్యప్ప ఇరుముడి కట్టుకుని శబరిమలకు వెళ్లారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment