ముగిసిన బాలవికాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ప్రశాంతి నిలయం: బాలవికాస్ పూర్వ విద్యార్థుల రెండు రోజు సమ్మేళనం ఆదివారం ముగిసింది. చివరి రోజు ఉదయం బాలవికాస్ పూర్వ విద్యార్థులు, గురువులు యజుర్ మందిరం నుంచి ర్యాలీగా ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధి చెంతకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలవికాస్ లక్ష్యాలకు కట్టుబడి ఉంటామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. సేవా భావంతో ఉత్తమ సేవలు అందించిన బాలవికాస్ గురువులకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజంగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు, గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి జ్ఞాపికలను బహూకరించారు. అసోంకు చెందిన బాలవికాస్ విద్యార్థులు జానపద నృత్య ప్రదర్శన నిర్వహించారు.
కేంద్రమంత్రికి ఘన స్వాగతం
ప్రశాంతి నిలయం: కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న ఆదివారం మధ్యాహ్నం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం చేరుకున్నారు. రోడ్డు మార్గంలో ప్రత్యేక కాన్వాయ్ ద్వారా చేరుకున్న ఆయనకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ రాజు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రీన్ రూంను సందర్శించారు. ట్రస్ట్ సేవా కార్యక్రమాలను, ప్రశాంతి నిలయంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి వచ్చిన సమయానికి దర్శన వేళలు ముగియడంతో ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శనం చేసుకోలేకపోయారు. కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారధి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment