రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Published Thu, Jan 16 2025 7:22 AM | Last Updated on Thu, Jan 16 2025 7:22 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మరొకరి పరిస్థితి విషమం

మంత్రి జన్మదినానికి వచ్చి వెళ్తుండగా ఘటన

పెనుకొండ: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖామంత్రి సవిత పుట్టినరోజు వేడుకలకు వచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలిపి స్వగ్రామానికి తిరిగి వెళ్తూ ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరు చనిపోగా మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. వివరాల్లోకెళితే.. రొద్దం మండలం ఎం. కొత్తపల్లికి చెందిన బోయ సంజీవప్ప, బోయ వీరన్న టీడీపీ కార్యకర్తలు. బుధవారం మంత్రి సవిత పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలపడానికి పెనుకొండకు వచ్చారు. మంత్రికి శుభాకాంక్షలు తెలిపి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అయితే పెనుకొండ రైల్వేగేటు దాటిన తర్వాత మైక్రోస్టేషన్‌ వద్ద ఘాట్‌ రోడ్డులో వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన బోయ సంజీవప్పను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన బోయ వీరన్నను బెంగళూరుకు తరలించారు. అతని పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.

దాడి చేసిన కానిస్టేబుల్‌ వీఆర్‌కు..

అనంతపురం: యువకుడిపై అకారణంగా దాడి చేసిన కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. నగరంలో మూడు రోజుల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌పై వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ నారాయణస్వామి భౌతికదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షిలో ‘ఖాకీల కర్కశం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ మైనార్టీ నాయకులు.. మేయర్‌ వసీం సలీం ఆధ్వర్యంలో అనంతపురం డీఎస్పీని కలిసి దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పందించిన ఎస్పీ జగదీష్‌.. ఘటనపై విచారించాలని అనంతపురం డీఎస్పీ వి. శ్రీనివాసరావును ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం కానిస్టేబుల్‌ నారాయణస్వామిని వీఆర్‌కు పంపుతూ ఎస్పీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు.

గంజాయి బ్యాచ్‌ వీరంగం

తాడిపత్రిటౌన్‌: గంజాయి బ్యాచ్‌ మళ్లీ వీరంగం సృష్టించింది. మత్తులో బేల్దారిపై కత్తితో దాడి చేసి గాయపరిచింది. పట్టణంలోని టైలర్స్‌ కాలనీకి చెందిన బేల్దారి నాగేంద్ర బుధవారం సాయంత్రం తన ఇంటి సమీపంలోని టీ స్టాల్‌ వద్ద టీ తాగుతున్నాడు. ఈ క్రమంలోనే గంజాయి సేవించి అక్కడికి చేరుకున్న పట్టణానికి చెందిన యూనస్‌, యోసెన్‌, దీపక్‌ అలియాస్‌ డూపర్‌లు కత్తితో నాగేంద్రపై దాడి చేసి పరారయ్యారు. గాయపడిన నాగేంద్రను స్థానికులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సీసీ ఫుటేజీ సాయంతో నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.

జస్టిస్‌ గుణరంజన్‌కు

ఘన స్వాగతం

ఉరవకొండ: ఏపీ హైకోర్టు అదనపు జడ్జి జస్టిస్‌ గుణరంజన్‌కు ఘన స్వాగతం లభించింది. మండల పరిధిలోని రాకెట్ల గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి బుధవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పెన్నహోబిలం ఆలయ మాజీ చైర్మన్‌ అశోక్‌, గ్రామ సర్పంచ్‌ దెయ్యాల నాగరాజుతో పాటు ప్రజలు జడ్జికి స్వాగతం పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
1
1/2

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
2
2/2

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement