జిల్లా హాకీ జట్టు ఎంపిక
ధర్మవరం: జిల్లా సబ్ జూనియర్ బాలుర హాకీ జట్టును ఎంపిక చేసినట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బంధనాథం సూర్యప్రకాష్, జిల్లా అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు మదనపల్లిలో జరగనున్న రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా హాకీ జట్టును ఎంపిక చేశామన్నారు. జిల్లా సబ్ జూనియర్ బాలుర హాకీ జట్టు సభ్యులుగా శబరీష్‌గౌడ్, ఫజులుద్దిన్, వెంకట్ అభిషిక్త్, రితీష్, రాంచరణ్, సాధిక్‌వలి, గోవర్ధన్, జశ్వంత్, నవదీప్, ఆదికేశవ, విక్కీ, పోతలయ్య, స్వామి, సచిన్, కార్తీక్, ధనుష్, రాహుల్, పుణీత్, చరణ్‌తేజ్ ఉన్నారన్నారు. టీం కోచ్‌గా సాయికుమార్, మేనేజర్‌గా వెంకటేష్‌నాయక్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. హాకీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గౌరీప్రసాద్, జిల్లా కోచ్ హస్సేన్, గౌరవాధ్యక్షుడు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు ఉడుముల రామచంద్ర పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment