అక్రమ మద్యం వెనుక ఎవరున్నా వదిలేది లేదు
హిందూపురం అర్బన్: అక్రమ మద్యం, కల్తీ కల్లు అమ్మకాలపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో ఎకై ్సజ్ ఉన్నతాధికారులు స్పందించారు. అనంతపురం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ రమేష్ గురువారం హిందూపురం చేరుకొని ఎకై ్సజ్ కార్యాలయ అధికారి రామకృష్ణ, సిబ్బందితో ఆరా తీశారు. ఏఈఎస్ రమేష్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర, కర్ణాటక మద్యం అమ్మకాలు, బెల్ట్ షాపుల్లో అమ్మకాలు చేస్తూ పట్టుబడిన 12 మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్నారు. అంతటితో కేసు ముగియలేదని మద్యం ఎవరు సరఫరా చేశారు? వారు ఎవరికి రవాణా చేస్తున్నారు? డంప్ ఎక్కడ ఏర్పాటు చేశారు? తదితర వాటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. తెర వెనుక ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదన్నారు. అలాగే హిందూపురం ఎకై ్సజ్ కార్యాలయ పరిధిలోనే 17 చోట్ల కల్తీ కల్లు అమ్మకాలు చేస్తున్నట్లు చిత్తూరు ల్యాబ్ నుంచి రిపోర్టులు అందాయని, వాటిపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. కల్తీ మద్యం, కల్లు అమ్మకాలకు సహకరించారన్న ఆరోపణలతో ఇక్కడ పని చేస్తున్న సీఐ లక్ష్మీదుర్గయ్యను పక్కన పెట్టామని వెల్లడించారు. అతనే కాకుండా శాఖలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏది ఏమైనా అక్రమ మద్యం, కల్లీ కల్లు వ్యవహారాలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment