పీఏల కనుసన్నల్లోనే..
అక్రమ మద్యం దందా విషయం గురించి కొందరు పోలీసులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల కనుసన్నల్లోనే మద్యం దందా జరుగుతుండటంతో నోరుమెదపడం లేదని అంటున్నారు. ఎకై ్సజ్ పోలీసుల తీరు అదే కోణంలో కొనసాగుతోంది. అంతేకాకుండా మద్యం, బెల్టు షాపుల నిర్వాహకుల నుంచి ప్రతి నెలా కొందరు పోలీసులకు కూడా ‘మామూళ్లు’ వెళ్తున్నాయన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరించింది.
Comments
Please login to add a commentAdd a comment