పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి
ప్రశాంతి నిలయం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి హరికృష్ణ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇంటర్న్‌షిప్ చేసేందుకు టాప్ 500 కంపెనీలతో ఒప్పందం ఉంటుందని, కనీసం ఆరు నెలలు సాధన చేయాల్సి ఉంటుందన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 93986 43930 నంబరును సంప్రదించాలని కోరారు.
రిపబ్లిక్ డే వేడుకలకు
ధర్మవరం జానపద కళాకారిణి
ధర్మవరం అర్బన్: రిపబ్లిక్ డే వేడుకల్లో ధర్మవరం పట్టణానికి చెందిన జానపద కళాకారిణి సోమిశెట్టి సరళ తన బృందంతో కలిసి ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో రిహార్సల్స్ చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈనెల 24న గిన్నిస్ బుక్ నిర్వాహకుల సమక్షంలో ప్రదర్శన ఇస్తున్నామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 22 జానపద కళారూపాలు, 29 గిరిజన కళారూపాలతో కలిపి 5 వేల మంది కళాకారులతో ఒక పెద్ద కళా ప్రదర్శన ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే 26వ తేదీన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు ప్రదర్శన ఇస్తామన్నారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకండి
పుట్టపర్తి టౌన్: ఆర్టీసీలో అప్రెంటిషిప్ చేసేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తున్న అభ్యర్థులు ఈనెల 20వ తేదీన కర్నూలు శిక్షణ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలని డీపీటీఓ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్ట్, జనన ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ బుక్ జిరాక్స్ సెట్, పాస్‌ఫొటోతో పాటు రూ.118 ఫీజు తీసుకొని జనవరి 20న కర్నూలులో ఉన్న శిక్షణ కళాశాలలో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు.
అప్రెంటిషిప్‌కు ఎంపికై న వారి
నంబర్లు ఇలా..
డీజల్ మెకానిక్: 61, 18, 67, 91, 84, 81, 72, 61, 12, 50, 79, 19, 10, 92, 42, 20, 9, 80, 59, 24, 40, 45, 26, 76, 34, 83, 37,
మోటర్ మెకానిక్: 34, 22, 8,
ఎలక్ట్రీషన్: 36,87,95, వెల్డర్: 06,
పెయింటర్: 11, డ్రాఫ్ట్‌మెన్ సివిల్: 02
బుక్కపట్నంలో చిరుత కలకలం
పుట్టపర్తి: బుక్కపట్నం మండల పరిధిలోని కృష్ణాపురం, గోపాలపురం గ్రామాల సమీపంలోని పంట పొలాల్లో బుధవారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచారంపై స్థానికులు అటవీశాఖ, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం వారు చిరుత సంచరించిన పంట పొలాలను పరిశీలించారు. స్థానికులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరుత ఆచూకీ తెలిసే వరకూ ఆయా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే గురువారం యాదలంకపల్లి పరిసర ప్రాంతాలలో చిరుత సంచరించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment