రుణాల మంజూరులో లక్ష్యం చేరుకోవాలి
ప్రశాంతి నిలయం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాలను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో డీఎల్‌టీసీ (డిస్ట్రిక్ట్ లెవెల్ టెక్నికల్ కమిటీ), జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాలను చేరుకునేందుకు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. స్టాండప్ ఇండియా కింద ప్రతి బ్యాంకు రెండు రుణాలను కచ్చితంగా మంజూరు చేయాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా విరివిగా అవగాహన కల్పించాలన్నారు. బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ కింద అర్హులైన వారందరికీ రుణాల మంజూరు చేయాలన్నారు. స్టాండప్ ఇండియా, విద్యా రుణాలు, వ్యవసాయ, స్వానిధి, రివర్స్ రుణాలు, ఎంప్లాయిమెంట్ జనరేషన్ రుణాలు, పీఎంఈజీపి, విశ్వకర్మ, హార్టికల్చర్ కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల కోసం రుణాల మంజూరులో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.
పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి
పెండింగ్ పనులు సత్వరమే ప్రారంభించి.. పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ కాంట్రాక్టర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రైల్వే, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, అటవీ, చిన్న నీటిపారుదల శాఖలకు సంబంధించి భూ సేకరణ అంశాలపై ఆయా శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ.. 716జీ జాతీయ రహదారి, అనుబంధాలు, పెండింగ్ సమస్యలను వారం లోపు పరిష్కరించాలన్నారు. భూ సమస్యపై ఎలాంటి సందేహాలు ఉన్నా.. జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. చిలమత్తూరు మండల పరిధిలోని చాగలేరు గ్రామ ప్రజలతో మాట్లాడి భూగర్భ మార్గాన్ని క్లియర్ చేయాలని ఎన్‌హెచ్ అధికారులకు ఆదేశించారు. నేషనల్ హైవే 342కు సంబంధించి ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 పనులపై సమీక్షించి త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ఫారెస్ట్ అధికారి చక్రపాణి, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్, నేషనల్ హైవేస్ అధికారి అశోక్‌రెడ్డి, ఎన్‌హెచ్ డీఈ గిడ్డయ్య, మేనేజర్ ముత్యాలరావు, ఏపీ మైన్స్ అధికారి పెద్దిరెడ్డి, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.
బ్యాంకు అధికారులకు
కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment