కవర్లు ఇక్కడ .. కంది పప్పు ఎక్కడ ?
చిలమత్తూరు: ప్రజావసరాల కోసం ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే కంది పప్పు ప్యాక్ చేసిన ఖాళీ కవర్లు రాష్ట్ర సరిహద్దు దగ్గర కుప్పలు తెప్పలుగా కనిపించడం కలకలం రేపుతోంది. కంది పప్పును వేరే బ్యాగుల్లోకి వేసుకొని కవర్లు మాత్రం ఇక్కడే వదిలిసి వెళ్లినట్లు స్పష్టమవుతోంది. అయితే ప్రభుత్వం నుంచి రేషన్‌కార్డుదారులకు కంది పప్పు సరఫరా కాలేదని ప్రచారం చేస్తూ రేషన్ షాపు నిర్వాహకులతో పాటు కూటమి నాయకులే ఈ దందా చేస్తున్నారన్న విమర్శలున్నాయి. కంది పప్పును రేషన్ దుకాణాల్లో కేజీ రూ.67కు విక్రయించాల్సి ఉండగా బయటి మార్కెట్‌లో రూ.130 నుంచి రూ.150 వరకూ విక్రయిస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా పేదలకు అందాల్సిన కంది బ్యాళ్లు పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులెవరూ పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కవర్లు పారవేసిన ప్రాంతాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment