రేపు ‘పురం’ చైర్మన్ ఎన్నిక
హిందూపురం: రసవత్తరంగా సాగుతున్న హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ముగింపు ఘట్టానికి చేరుకుంది. 3వ తేదీ సోమవారం చైర్మన్ ఎన్నిక నిర్వహించనుండగా... ఎలాగైనా పీఠం దక్కించుకోవాలని టీడీపీ సర్వం ఒడ్డుతోంది. ఇప్పటికే పలువురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించింది. అయితే టీడీపీకి చెక్ పెట్టేందుకు వైఎస్సార్ సీపీ అధిష్టానం కూడా సిద్ధమైంది. విప్ జారీ చేసి కౌన్సిలర్లను కట్టడి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
విప్ ధిక్కరిస్తే పదవికి చేటే..
వైఎస్సార్ సీపీ విప్ జారీ చేస్తే ఆ పార్టీ సింబల్‌పై గెలిచిన కౌన్సిలర్లంతా తప్పకుండా ఆ పార్టీ బలపరిచిన వ్యక్తికే మద్దతు తెలపాల్సి ఉంటుంది. అలాకాకుండా పార్టీ ఫిరాయించి వ్యతిరేక పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపితే అలాంటి సభ్యులు చట్ట ప్రకారం కౌన్సిలర్ పదవి కోల్పోవాల్సి వస్తుంది. ప్రలోభాలు, అఽధిపార్టీ ఒత్తిడితోనో ఓటు వేస్తే ఆ సమయంలో వారి ఓటు చెల్లుబాటు అయినా... ఆ తర్వాత వారు కౌన్సిలర్ పదవిని కోల్పోల్సివస్తుంది. 1995–96 మధ్యకాలంలో విజయనగరం మున్సిపల్ అధ్యక్ష ఎన్నిక సమయంలో ఒక సభ్యుడి ఓటు కోసం ఎన్నిక జరిగింది. అప్పడు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయగా...అందుకు విరుద్ధంగా ఓటు వేసిన వారంతా కౌన్సిలర్ పదవులు కోల్పోయారు. పురంలోనూ కౌన్సిలర్లు గీత దాటితే అదే జరుగుతుందన్న చర్చ జరుగుతోంది.
కుర్చీ కోసం టీడీపీ కుట్రలు
వేధింపులు. ప్రలోభాలతో
పార్టీ ఫిరాయింపులు
విప్ జారీ చేసేందుకు సిద్ధమైన
వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment