ప్రభుత్వ రంగ సంస్థలను విస్మరించారు..
జిల్లాలో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కొటిక్స్ (నాసిన్) అభివృద్ధి, సేవల విస్తరణకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు మార్లు సందర్శించినా కేటాయింపులు మాత్రం చేయకపోవడంపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) వంటి ప్రతిష్టాత్మక సంస్థకు భూమిపూజ చేసి ఏడేళ్లు పైగా కావస్తున్నా..
భూసేకరణ మినహా ఒక్క అడుగు ముందుకు పడలేదు. 10 వేల మందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ఏర్పాటు కానున్న ‘బెల్’ స్థితిగతులపై కనీసం ఎలాంటి ప్రకటన లేకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇది పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌గా ఉందని మేధావులు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment