సగటు ధరల్లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ | - | Sakshi
Sakshi News home page

సగటు ధరల్లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌

Published Fri, Feb 7 2025 1:23 AM | Last Updated on Fri, Feb 7 2025 12:16 PM

ఆల్‌టైమ్‌ రికార్డ్‌

ఆల్‌టైమ్‌ రికార్డ్‌

చలికి తగ్గిన మల్బరీ పంట ఉత్పత్తి

ధర పెరుగుదలతో రైతు దరహాసం

హిందూపురం అర్బన్‌: తెలుగు రాష్ట్రాల్టో పట్టుగూళ్ల మార్కెట్‌కు ప్రసిద్ధిగాంచిన హిందూపురంలో గురువారం సగటు ధరలు ఆల్‌టైమ్‌ రికార్డ్‌ నమోదు చేశాయి. ఏటా వెయ్యి టన్నుల వరకు పట్టు గూళ్లు ఇక్కడి మార్కెట్‌కు వస్తాయి. చలి తీవ్రత కారణంగా మల్బరీ పంట ఉత్పత్తి తగ్గింది. మార్కెట్‌కు వచ్చిన పట్టుగూళ్లకు డిమాండ్‌ ఉండడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 

గురువారం మార్కెట్‌ చరిత్రలోనే అత్యధిక రేట్లు పలికాయి. మార్కెట్‌కు రెండు రకాల పట్టుగూళ్లు వస్తాయి. అందులో బైవోల్టిన్‌ పట్టు గూళ్లు 96 శాతం రావడం విశేషం. మొత్తం 2,116 కిలోల పట్టు గూళ్లు రాగా.. ఇందులో మొదటి రకం నాణ్యమైన పట్టుగూళ్లు గరిష్ట ధర కిలో రూ.823 పలకగా, రెండో రకం రూ.792, కనిష్ట ధర రూ.750 పలికింది. మార్కెట్‌ చరిత్రలోనే సగటు రేట్ల రికార్డు నమోదైంది. పట్టుగూళ్ల ధరలు ఆశాజనకంగా ఉండడంతో మల్బరీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చింతపండు రికార్డు ధర
హిందూపురం అర్బన్‌: చింతపండు గరిష్ట ధర రికార్డు సృష్టించింది. హిందూపురం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం 364 క్వింటాళ్ల చింతపండు వచ్చింది. మొదటి రకం (కరిపులి) గరిష్ట ధర క్వింటాలు రూ.29 వేలు పలికింది. కనిష్టం రూ.8,200, సగటురూ.15వేలు చొప్పున క్రయవిక్రయాలు సాగాయి. ఇక రెండో రకం (ఫ్లవర్‌) క్వింటాలు గరిష్ట ధర రూ.9,500 పలికింది. కనిష్టం రూ.4వేలు, సగటు రూ.8,500, పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి జి.చంద్రమౌళి తెలిపారు. ప్రతి సోమ, గురువారాల్లో చింతపండు, మంగళ, శుక్రవారాల్లో మిర్చి క్రయ విక్రయాలు మార్కెట్‌లో జరుగుతున్నాయని, రైతులు నాణ్యమైన సరుకు తీసుకొచ్చి అమ్ముకోవాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/3

No Headline

No Headline2
2/3

No Headline

No Headline3
3/3

No Headline

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement