రేషన్‌కు తప్పని తిప్పలు
అడవులను రక్షించుకోవాలి
పుట్టపర్తి టౌన్: అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి అన్నారు. గురువారం పుట్టపర్తిలో పోలీస్, అటవీశాఖ అధికారులు విద్యార్థులు మున్సిపల్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి ‘అడవికి నిప్పు.. మానవాళికి ముప్పు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు’ అంటూ నినాదాలు చేశారు. అటవీ శాఖ అధికారి చక్రపాణి మాట్లాడుతూ జిల్లాలో 33 శాతం భూమి పచ్చదనంతో నిండి ఉండాలని, అయితే 13 శాతం మత్రమే పచ్చదనం నిండి ఉందని పేర్కొన్నారు. అడవులను అగ్ని బారి నుంచి కాపాడుకోగలిగితే కొంత మేర లక్ష్యాన్ని చేరుకోగలమన్నారు. అడవులు, ఇతర ప్రాంతాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించగలిగితే 33 శాతం లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, అటవీ క్షేత్ర అధికారి యామినీ సరస్వతి అధికారులు శ్రీనివాసులు, గుర్రప్పతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
గంటల వ్యవధిలో ‘నో స్టాక్’
ఓడీచెరువు మండలం డబురువారిపల్లిలోని చౌక డిపో – 22 డీలర్ లావణ్య రేషన్ సరిగా పంపిణీ చేయడం లేదని జంబులవారిపల్లి గ్రామస్తులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గత నెలలో కూడా బియ్యం పంపిణీ చేయలేదని, ఈ నెల అయినా తీసుకుందామని వస్తే తొలిరోజే అదీ ఉదయం పది గంటలకే స్టాక్ అయిపోయిందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చిలమత్తూరు/ ఓడీ చెరువు: రేషన్ సరుకుల కోసం కార్డుదారులకు తిప్పలు తప్పడం లేదు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇంటింటికీ రేషన్ పద్ధతికి స్వస్తి చెప్పి చౌకధాన్యపు దుకాణాల వద్దే ఇస్తున్నారు. అది కూడా అన్ని స్టోర్లూ ఒకేసారి పంపిణీ చేయడం లేదు. రెండు మూడు రోజులు ఒకస్టోర్‌లో వేసి తర్వాతే మరొక స్టోర్‌లో పంపిణీ మొదలు పెడుతున్నారు. దీనికితోడు రేషన్ సరుకులు దొరుకుతాయో లేదోనని కార్డుదారులు ఎక్కడ స్టోర్ తెరిస్తే అక్కడకు తండోపతండాలుగా వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment