![భక్తి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/07022025-satya_tab-01_subgroupimage_1885720128_mr-1738870912-0.jpg.webp?itok=XOV8qqPw)
భక్తిశ్రద్ధలతో మధ్వనవమి ఉత్సవం
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం మధ్వనవమి ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలంకరణలో శ్రీవారు సాయంత్రం హనుమద్ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలు నెల రోజుల తర్వాత ప్రారంభమవుతాయని తెలపడమే ఈ ఉత్సవ ప్రాముఖ్యత. భక్తులు బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి కోరారు.
మద్యం దుకాణాల లాటరీ 10కి వాయిదా
పుట్టపర్తి టౌన్: కల్లు గీత కులాలకు ప్రభుత్వం కేటాయించిన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ఏడో తేదీ నుంచి పదో తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి గోవింద్‌నాయక్ మీడియాకు వెల్లడించారు. జిల్లాలో 8 ఎకై ్సజ్ పోలీస్టేషన్ల పరిధిలో తొమ్మిది మద్యం దుకాణాలు కల్లు గీత ఉప కులాలకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ దుకాణాలకు ఈ నెల ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించే విధంగా వెసులుబాటు కల్పించారు. తొమ్మిదో తేదీ దరఖాస్తుల పరిశీలన, పదో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కలెక్టర్ చేతన్ చేతులు మీదుగా లాటరీ డ్రా ద్వారా దుకాణాలు ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు పుట్టపర్తి సమీపంలోని ఉజ్వల ఫౌండేషన్‌లో ఉన్న ఎక్‌పైజ్‌అండ్ ప్రొహిబిషన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్
కదిరి టౌన్: డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని స్టాంప్స్, రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి సూచించారు. గురువారం కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులుపై పత్రికల్లో వచ్చిన వాటి గురించి సిబ్బందిని విచారణ చేశారు. భూములకు సంబంధించి అన్ని డాకుమెంట్లూ సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఫణికుమార్‌కు సూచించారు.
![భక్తిశ్రద్ధలతో మధ్వనవమి ఉత్సవం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06kdr103-110122_mr-1738870912-1.jpg)
భక్తిశ్రద్ధలతో మధ్వనవమి ఉత్సవం
![భక్తిశ్రద్ధలతో మధ్వనవమి ఉత్సవం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06kdr101f-110122_mr-1738870912-2.jpg)
భక్తిశ్రద్ధలతో మధ్వనవమి ఉత్సవం
Comments
Please login to add a commentAdd a comment