![జై సు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06gtl204a-110018_mr-1738870913-0.jpg.webp?itok=EKb8N8u8)
జై సునామ జకినీ మాతా
గుత్తి: పట్టణంలోని ఆర్‌ఎస్ రోడ్డులో గురువారం సునామ జకినీ మాత జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో ఆరె కటికలు తరలివచ్చారు. సునామ జకినీ మాత ఆలయంలో తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వందలాది మంది కన్యలు, ముత్తయిదువులు గుత్తిలోని వాసవీ షిరిడీ సాయి బాబా దేవాలయం వద్ద నుంచి పూర్ణ కుంభాలతో సునామ జకినీ మాత ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జై శ్రీ సునామ జకినీ మాతాకీ, శ్రీ మల్కూమ జకినీ మాతాకీ జై’ అనే నినాదాలతో మార్మోగాయి. మిమిక్రీ, చిన్నారుల నత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సునామ జకినీ మాత ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆలూరు లక్ష్మణ రావు, ఆలయ ధర్మ కర్త సురేష్‌రావు, కార్యానిర్వాహక అధ్యక్షుడు సాయినాథ్, మహిళా అధ్యక్షురాలు సరస్వతీ బాయి, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రావు, కోశాధికారి సుధాకర్‌రావు, ఉప కోశాధికారి బాబురావు, సాయి, అమర్, వేలాది మంది ఆరె కటికలు పాల్గొన్నారు.
కనులపండువగా జాతర
![జై సునామ జకినీ మాతా 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06gtl204-110018_mr-1738870913-1.jpg)
జై సునామ జకినీ మాతా
Comments
Please login to add a commentAdd a comment