విద్యుత్ చార్జీల పెంపు తగదు
అరసవల్లి: విద్యుత్ చార్జీలు పెంచేది లేదంటూ గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అమాంతం చార్జీలను పెంచేసిందని వామపక్ష నేతలు దుయ్యబట్టారు. స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావులు మాట్లాడుతూ పాపం పాలకులదైతే.. శిక్ష ప్రజలకా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోపే రెండు సార్లు చార్జీల పెంపును అమలు చేస్తుండటంపై మండిపడ్డారు. జనాగ్రహం ఇప్పటికే బయటకొచ్చేస్తుందని, పాలకులు చార్జీల పెంపుపై పునరాలోచించి నిర్ణయం తీసుకోకపోతే.. తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బి.హరీష్, ఎవైఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment