చిరుద్యోగులకు శిక్ష | - | Sakshi
Sakshi News home page

చిరుద్యోగులకు శిక్ష

Published Wed, Nov 20 2024 12:34 AM | Last Updated on Wed, Nov 20 2024 12:34 AM

చిరుద్యోగులకు శిక్ష

చిరుద్యోగులకు శిక్ష

రాజకీయ

కక్ష..

చిరుద్యోగులపై కొనసాగుతున్న వేధింపులు

తాత్కాలిక, దినసరి,అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం

ప్రస్తుతం ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్ల వంతు

మంత్రి అచ్చెన్న నియోజకవర్గంలో అత్యధికంగా తొలగింపు

వందలాది మందిని తొలగించేందుకు రంగం సిద్ధం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

ధికార పక్ష నాయకులు పెంచుకున్న రాజకీయ కక్ష.. చిరుద్యోగుల పాలిట శిక్షగా మారుతోంది. ఇంటికో ఉద్యోగమని ఊదరగొట్టిన కూటమి నాయకులు ఇప్పుడు ఉన్న ఉద్యోగులను తీసేస్తున్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడా హామీని గాలికొదిలేసి ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. దశల వారీగా తొలగింపు కార్యాచరణ అమలు చేస్తున్నారు. తొలుత మధ్యాహ్న భోజన కార్మికులపై పడ్డారు. ఆ తర్వాత రేషన్‌ డిపో డీలర్లు, యూనివర్సిటీ ఉద్యోగులపై వేటు వేశారు. గ్రామ సమాఖ్య సహాయకులు(వీఎఓ), వైద్య ఆరోగ్యశాఖలోని చిరుద్యోగులు, దేవాలయాల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగుల్ని వదలేదు. ఇప్పుడు ఫీల్డ్‌ అసిస్టెంట్లపైనా, 108,104 ఉద్యోగులపై పడ్డారు. ఉద్యోగుల ఉపాధి తీసే పనిలో నిమగ్నమయ్యారు.

ఫీల్డ్‌ అసిస్టెంట్ల మెడపై తొలగింపు కత్తి..

అధికారంలోకి వస్తే ఏడాదికి 4లక్షలు చొప్పున ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాల్ని పీకేస్తోంది. చంద్రబాబు అండ్‌కో చెప్పిన మేరకై తే జిల్లాలో నిరుద్యోగులుగా ఉన్న 7లక్షల 28వేల 910మందికి ఉద్యోగాలు కల్పించాలి. ఈ లోపు వారికి నెలకి రూ. 3వేలు చొప్పున నిరుద్యోగ భృతి అందించాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ కానివారు చిరు ఉద్యోగులుగా ఉన్నారో గుర్తించి వారందరినీ ఏరివేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఎక్కడైతే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులున్నారో వారందర్నీ తీసేస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్ల మెడపై తొలగింపు కత్తి పెట్టారు. ఇప్పటికే జిల్లాలో 41మందిని తీసేశారు. మరో 60మందిని తీసేసేందుకు రంగం సిద్ధం చేశారు. మున్ముందు మరింత మందిని తొలగించాలని చూస్తున్నారు. తప్పుడు అభియోగాలు మోపి, కూటమి నాయకుల సిఫార్సుల మేరకు అధికారులు తొలగిస్తున్నారు. అత్యధికంగా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారు ఇక్కడ ఒక్కచోటే 21మందిని తొలగించారు.

చాంతాడంత జాబితా..

● కూటమి నాయకుల రాజకీయ కక్షలకు, వేధింపులకు చిరుద్యోగులు బలైపోతున్నారు. చిన్నపాటి ఉద్యోగంతో కుటుంబాలను పోషించుకుంటున్న వారందరినీ తీసేస్తే తప్ప ప్రస్తుత పాలకుల కడుపు చల్లారడం లేదు.

● 2014–19లో ఏ రకంగానైతే డ్వామా, డీఆర్‌డీఎ, హౌసింగ్‌, వ్యవసాయ శాఖలో పనిచేసిన అవుట్‌ సోర్సింగ్‌, తాత్కాలిక ఉద్యోగులను తొలగించారో అదే రకంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు.

● ఇసుక, మద్యం దోపిడీ, భూకబ్జాలు, కాంట్రాక్ట్‌ అక్రమాలే కాదు చిరుద్యోగుల తొలగింపు కూడా పునరావృతం చేస్తున్నారు.

● వలంటీర్‌ వ్యవస్థను ఆపేయడంతో జిల్లాలో ఇప్పటికే 15,328 మంది రోడ్డున పడ్డారు. తాము అధికారంలోకి వస్తే రూ. 10వేలు జీతం ఇస్తామని చెప్పిన చంద్రబాబు అండ్‌కో ఇప్పుడీ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసింది.

● కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో 90మంది మధ్యాహ్న భోజ నం కార్మికులను, 40మంది ఆయాలను తొలగించారు. మరో వంద మందిని తొలగించేందుకు ప్ర యత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ కి అనుకూలంగా లేని వారందరినీ తొలగించి, వారి ప్లేస్‌లో పచ్చ కండువాలు కప్పుకున్న వారిని వేసుకునేందుకు ప్లాన్‌ చేశారు.

● ప్రభుత్వ జీఓ ఆధారంగా 12 మంది వర్సిటీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. గతంలో నియమించిన 34 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నారు.

● రాజకీయ కక్షతో శ్రీకాకుళం నగర పా లక సంస్థలో శానిటరీ మేసీ్త్రలను తొలగించారు.

● 108, 104ఉద్యోగుల మెడపై కూడా కత్తి పెట్టారు. కాంట్రాక్ట్‌ డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

● రేషన్‌ డీలర్లపైనా కన్నేశారు. ఇప్పుడున్న డీలర్లను తొలగించి వారి స్థానంలో తమ వాళ్లను వేసుకోవడానికి మండలాల వారీగా జాబితాలు తయారు చేసి, అధికారులకు ఇచ్చారు. ఒకేసారి తీసేస్తే రచ్చ అయిపోతుందని దశల వారీగా తొలగింపు కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇప్పటికే తొలగించిన వారి సంఖ్య డబుల్‌ డిజిట్‌లో ఉంది.

● అరసవిల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న 48మంది దినసరి ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా తయారైంది. పొమ్మనకుండా పొగ బెట్టినట్టు జీతాలు ఇవ్వకుండా గాలికొదిలేశారు. ఉచితంగా సేవ చేయాలనుకుంటే రండి లేదంటే ఉండిపోండి అని అధికారులు ఇప్పటికే సెలవిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement