బాహుదా, వంశధార నదులను అనుసంధానించండి
● శాసన మండలిలో ఎమ్మెల్సీ నర్తు
కవిటి: శ్రీకాకుళం జిల్లాకు శివారు నియోజకవర్గమైన ఇచ్ఛాపురానికి సాగు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. శాసనమండలిలో మంగళవారం స్పెషల్ మెన్షన్ పీరియడ్‌లో మండలిలో ఎమ్మెల్సీ ఈ అంశంపై మాట్లాడారు. జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటిని వినియోగించుకుంటే సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఒకప్పుడు కొబ్బరి, జీడి మామిడి పంటలు, పచ్చని పైరుతో ఉద్దానం కళకళలాడేదని, ఇప్పుడు చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వంశధార నదీ జలాలను నేరేడు బేరేజీ నుంచి ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని బాహుదా నదికి అనుసంధానం చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment