కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలి
రణస్థలం: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న జరిగే కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురు వారం పైడిభీమవరంలో కరపత్రాలను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.19.28 లక్షల కోట్ల రుణమాఫీ, పన్నురాయితీ, ప్రోత్సాహాల పేరుతో ప్రజా ధనాన్ని దోచిపెట్టింద ని మండిపడ్డారు. సుప్రీంకోర్టు చెప్పినా అంగన్‌వా డీ, ఆశా, మధ్యాహ్న భోజన స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించడం లేదన్నారు. సరైన రాయితీలు, పంట గిట్టుబాటు ధర లేక లక్షలాది మంది రైతులు అత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులు కాలరాసే దుర్మార్గమైన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కె.అచ్చెన్నాయుడు, సురేష్, రమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment