అరసవల్లి: ప్రపంచ మత్స్యకార దినోత్సవం నాడైనా మత్స్యకారులకు ఆకలి తీర్చేలా ఎలాంటి భరోసా ఇవ్వలేని ఈ సంబరాలెందుకని జిల్లా మత్స్యకార సహకార సంఘ అధ్యక్షులు కోనాడ నర్సింగరావు, మాజీ అధ్యక్షులు మైలపల్లి నర్సింగరావులు ధ్వజమెత్తారు. గురువారం స్థానిక మత్స్యకార డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవాల్లో మత్స్యకార నేతలు సంయుక్తంగా ప్ర భుత్వ తీరుపై ధ్వజమెత్తారు. వేట నిషేధ సమయం పూర్తయి ఆరు నెలలవుతున్నా.. నేటికీ కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అర్హుల పేరుతో రీసర్వే అంటూ కాలయాపన చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వమైనా మత్స్యకారులకు మేలు చేయకపోతే ప్రశ్నిస్తామని, గత ప్రభుత్వం రూ.10 వేలు చొప్పున భృతిని ఐదేళ్ల పాటు అందించిందని, ఇప్పుడెందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. అలాగే భృతిని రూ.20 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించిన కూటమి ప్రభుత్వం అర్హులను వెంటనే గుర్తించి భృతిని అందజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment