No Headline
ఆమె వయసు పద్నాలుగేళ్లు.. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా తిరగాల్సిన అమ్మాయి. ఇంత చిన్న వయసులోనే ఆమె కిడ్నీలు పాడైపోయాయి. ఇప్పటికే 40 సార్లు డయాలసిస్ చేయించుకుంది. 41వ సారి డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయింది. మరో 14 రోజుల్లో ఆమె పుట్టిన రోజు రానుంది. అయితే పలాస కిడ్నీ ఆస్పత్రిలోని సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమయానికి చికిత్స అందించి ఉంటే బాలిక బతికేదని అంటున్నారు. వైద్యుల వాదన మాత్రం మరోలా ఉంది. హైబీపీ కారణంగానే అమ్మాయి చని పోయిందని చెబుతున్నారు. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. – కాశీబుగ్గ
కంచిలి మండలం తలతంపర గ్రామానికి చెందిన కుమారి బిసాయి (14) అనే బాలిక కిడ్నీ వ్యాధితో మృతి చెందింది. ఈమె కిడ్నీలు పాడైపోవడంతో ప్రతి వారం సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో వైద్యం తీసుకునేది. బుధవారం అక్కడ బీపీ పెరిగిపోవడంతో సోంపేట నుంచి పలాస కిడ్నీపరిశోధన కేంద్రానికి రిఫర్ చేశారు. ఆగమేఘాలపై ఆమెను ఇక్కడకు తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తీసుకువచ్చినా కిడ్నీ స్పెషలిస్టులు ఆమెకు చూడకుండా అత్యవసర (ఐసియు)విభాగంలో ఉంచేశారు. అనంతరం పలుమార్లు డయాలసిస్ యూనిట్‌లో సిబ్బందికి అక్కడి సిస్టర్లు సూచించినా పట్టించుకోలేదు. కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ యర్రా రాకేష్ వచ్చి చెబితే నే డయాలసిస్ చేస్తామని తేల్చి చెప్పేశారు. బుధవారం రాత్రి మరింత ఆయాసం అధికమై పరిస్థితి తీవ్రంగా మారడంతో ఉదయం ఆరు గంటలకు డయాలసిస్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి కూడా డాక్టర్లు, డయాలసిస్ యూనిట్ వారు రాకపోవడంతో ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్యలో 200లకు పైగా బీపీ పెరిగిపోయింది. అక్కడి నుంచి పరిస్థితి విషమంగా మారి ఏకంగా చనిపోయింది.
ఈ విషయం బయటకు చెప్పకుండా బాలిక తండ్రి రాము బిసాయి, కుమారుడు రాహుల్ బిసాయి ల ను వైద్యులు, వైద్య సిబ్బంది బలవంతంగా బయటకు పంపించేశారు. అనంతరం పదిగంటల సమ యంలో మరణించిందని చెప్పారు. వెను వెంటనే తల్లి, తండ్రి, సోదరుడు రోదించడంతో ఉన్నఫళంగా అక్కడి నుంచి మృతదేహాన్ని స్వగ్రామం కంచిలి మండలం తలతంపర గ్రామానికి తరలించారు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణం..
వైద్యులు ఉండి సరైన సమయానికి డయాలసిస్‌తో పాటు ఇతర అత్యవసర వైద్య సేవలు అందించకపోవడం వల్లనే తన బిడ్డ చనిపోయిందని తల్లి కమల బిసాయి తీవ్రంగా ఆవేదన చెందింది. రూ. 3500 చెల్లిస్తామన్నా డయాలసిస్ చేయలేదని అన్నా రు. కిడ్నీ వ్యాధి అంటే ఏంటో కూడా ఆమెకు తెలీదని, తగ్గిపోతే స్కూలుకు వెళ్తానని నవ్వుతూ చెప్పేదని ఆమె చెప్పారు. హోటల్‌లో పనిచేస్తున్న బాలిక తండ్రి రాము బిసాయి కష్టపడిన డబ్బులు పాపకు ఖర్చు చేసేవారమని, పలాస కిడ్నీ ఆస్పత్రిలో ఇదివరకు రూ.40వేలు ఖర్చుచేసి ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయిందన్నారు.
కిడ్నీ వ్యాధితో 14 ఏళ్ల బాలిక మృతి
వైద్యుల నిర్లక్ష్యమే: తల్లిదండ్రుల ఆరోపణ
డయాలసిస్ చేయడంలో ఆలస్యం చేశారని మండిపాటు
హైబీపీతో చనిపోయిందంటున్న వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment