ముప్పు జనాలకు..
శ్రీకాకుళం నగరంలోని హయాతినగరానికి ఆనుకుని ఉన్న నాగావళిలో ఇసుక ర్యాంపు నిర్వహణకు అనుమతి ఇవ్వగా ఎచ్చెర్ల మండలం పరిధిలోని తోటపాలెం గ్రామ పరిధిలో శ్మశానానికి 1100 మీటర్ల దూరంలో తవ్వకాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శ్మశానం పక్కనే బాట వేశారు. ఇదంతా టీడీపీ నాయకుడు జగదీష్ ఇక్కడ అంతా తానై వ్యవహరిస్తున్నారు.
నరసన్నపేట మండలంలోని గోపాలపెంటలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు ఇది. నాలుగెకరాల 73 సెంట్లలో తవ్వకాలకు అను మతి ఇవ్వగా కానీ నిర్వాహకులు అందుకు భిన్నంగా నదికి అన్ని వైపులా తవ్వేస్తున్నారు. మార్చి 13వ తేదీ వరకు తవ్వకాలు జరుపుకోవడానికి అవకాశం ఉండటంతో అనుమతికి మించి తవ్వకాలు జరిపేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment