పకడ్బందీగా క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే
నరసన్నపేట: క్యాన్సర్ వ్యాధులు(ఎన్‌సీడీ సీడీ)కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేపట్టాలని డీఎంహెచ్‌ఓ బి.మీనాక్షి అధికారులను ఆదేశించారు. గురువారం ఉర్లాం పీహెచ్‌సీని సందర్శించి సర్వే స్థితిగతులపై వైద్యులు గొలివి సుజాత, అరవింద్‌లను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీ పరిధిలో 18 ఏళ్లు నిండిన మహిళలు 15 వేల మంది ఉన్నారని, వీరికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ సుజాత వివరించారు. రొమ్ము, నోటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాధులను ఎంత త్వరగా గుర్తిస్తే చికిత్స అంత సులువు అవుతుందని డీఎంహెచ్‌ఓ చెప్పారు. పాఠశాలలను ప్రతి గురువారం, అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి శనివారం సచివాలయ ఎంఎల్‌హెచ్‌పీలు సందర్శించి పిల్లల కు ఆరోగ్య తనిఖీలు చేయాలని సూచించారు. వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment