ప్రమాదం జరిగిన తీరుపై విచారణ
భోగాపురం: గత నెల 30వ తేదీన శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఫార్చునర్ కారు పోలిపల్లి జాతీయ రహదారి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీకొట్టి అవతలి లైన్‌లో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాకుళానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రమాదం ఏవిధంగా జరిగిందనే అంశాంపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మణిబాబు, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ దుర్గారావులు ఆదివారం విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ముందుగా ప్రమాదం జరిగిన ప్రదేశం వద్దకు వెళ్లి నేషనల్ హైవే రోడ్డును, ప్రమాదానికి గురైన కారును పరిశీలించారు. ప్రమాదం ఏవిధంగా జరిగింది, హైవే రోడ్డు నిర్మాణంలో ఏమైనా లోపాలు ఉన్నాయా? డ్రైవర్ కారును నిర్లక్ష్యంగా నడపడం వల్ల ప్రమాదం జరిగిందా? లేదా వెహికల్‌లో ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే అంశాలపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో వారివెంట నేషనల్ హైవే అథారిటీ ఇంజినీర్ మల్లికార్జునరావు, సీఐ ఎన్వీ ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment