ఘనంగా నేవీ డే సంబరాలు
ఎచ్చెర్ల క్యాంపస్: నావికా దళ మాజీ సైనికులు ముందస్తు నేవీ డే వేడుకలను ఆదివారం కుశాలపురంలోని సింహద్వారం వద్ద ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో నిర్వహించారు. తాము పనిచేసిన రోజుల్లో జ్ఞాపకాలు, సాహసాలను అందరితో పంచుకున్నా రు. అలాగే అమరవీరులకు నివాళులర్పించారు. జిల్లా ఎక్స్ సర్వీస్‌మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు పూర్ణ చంద్రరావు కటకం మాట్లాడుతూ యువత దేశ రక్షణకు సంబంధించి త్రివిధ దళాల్లో చేరేందుకు ఆసక్తి చూపించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో విశ్రాంత నేవీ ఉద్యోగులు పైడి నాగేశ్వరరావు, పైడి భాస్కర్‌కుమార్, సీపాన రమణమూర్తి, పైడి తవిటయ్య, పైడి విశ్వేశ్వరరావు, పైడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment