సర్కారుది నయవంచన
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ నర్తు రామారావు,
మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్
కవిటి: బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఆరునెలలైనా పూర్తికాకముందే రెండుసార్లుగా విద్యుత్ ట్రూ అప్, ఇంధన సర్దుబాటు చార్జీలను పెంచడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ ధ్వజమెత్తారు. ఆదివారం కవిటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబునాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోదని చెప్పారని, కానీ బిల్లు కడితేనే కరెంటు షాక్ కొట్టేలా ఆర్థిక భారం మోపుతున్నారని దు య్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలకు వైద్యశాలల్లో మందులు అందుబాటులో లేవని, తొలిసంతకం అంటూ ఆర్భాటంగా ప్రకటించిన డీఎస్సీ పరీక్ష జరగడం లేదని, నిత్యావసరాల ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయని తెలిపారు. ఏ రంగంలోనూ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. సమావేశంలో ఎంపీపీ కడియాల పద్మ, మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment