ఎవరి సామర్థ్యం ఎంత..?
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలల్లో విద్యార్థుల శక్తి సామర్థ్యాలు అంచనా వేసేందుకు కేంద్రం వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యం తీరును అంచనా వేసేందుకు సరికొత్త సామర్థ్య సర్వే నిర్వహిస్తున్నారు.
4న పరఖ్ సర్వే నిర్వహణ..
కేంద్ర ప్రభుత్వం పరఖ్ పేరిట డిసెంబర్ 4న సర్వే నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హాలిస్టిక్ డెవలప్మెంట్(పరఖ్) పేరుతో రాష్ట్రీయ సర్వేక్షణ్–2024 సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సర్వేను 2021లో చివరిసారిగా నిర్వహించారు. ఈ ఏడాది డిసెంబర్ 4న నిర్వహించేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఎస్‌సీఈఆర్టీ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.
జిల్లాలో 92 పాఠశాలల్లో సర్వేకు చర్యలు..
శ్రీకాకుళం జిల్లాలో 92 పాఠశాలలను పరఖ్ సర్వే కోసం ఎంపిక చేశారు. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు 56, ప్రైవేటు పాఠశాలలు 36 ఉన్నాయి. 3, 6, 9 తరగతుల విద్యార్థులను పరీక్షిస్తారు. ఇందులో ఒక్కో పాఠశాల నుంచి తరగతికి సగటున 30 మంది చొప్పున మూడు తరగతులకు సంబంధించిన విద్యార్థులను పరఖ్ నిబంధనలకు అను గుణంగా ఎంపిక చేస్తారు.
జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ తిరుమల చైతన్య జిల్లా స్థాయి కోఆర్డినేటర్‌గా, డీసీఈబీ సెక్రటరీ గెడ్డాపు రాజేంద్రప్రసాద్ సహాయ జిల్లా స్థాయి కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తుండగా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్‌గా తీడ ప్రసాదరావు(సీఆర్‌ఎంటీ సారవకోట), పట్ట వైకుంఠరావు (సీఆర్‌ఎంటీ జలుమూరు), సమగ్ర శిక్ష ఏఎంఓ చిగిలిపల్లి సుధాకర్ పర్యవేక్షిస్తున్నారు.
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగునకు కేంద్రం చర్యలు
జిల్లాలో పరఖ్ సర్వేక్షణ్‌కు
92 పాఠశాలల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment