హామీలు మరిచి.. భారం మోపుతున్నారు
శ్రీకాకుళం రూరల్: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. హామీలు మర్చిపోయి ఇప్పుడు విద్యుత్‌భారం పెంచుతున్నారని విమర్శించారు. ఆయన ఆదివారం శ్రీకాకుళంలోని ధర్మాన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలపై మాట్లాడి న కూటమి నాయకులు ఇప్పుడెందుకు చార్జీలు పెంచుతున్నారని ప్రశ్నించారు. నిత్యావసరాల ధర లు కూడా పెరిగాయని అన్నారు. లోకేష్ చెప్పిన విధంగా రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, శ్రేణులపై దాడులు చేయడం సరికాదన్నారు. 50 ఏళ్లకే పెన్ష న్, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, ఉచిత బస్ సౌకర్యాలు వంటివి అమలు చేయలేదని గుర్తు చేశారు.
వైఎస్సార్ సీపీ హయాంలో ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేశామని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయంపై చెరగని ముద్ర వేశామన్నారు. జిల్లాలో కిడ్నీ ఆస్పత్రి కట్టామని, మూలపేట పోర్టు నిర్మాణం మొదలుపెట్టామని, వంశధార నుంచి రూ.700 కోట్లతో పలాసకు మంచినీటి సదుపాయం కల్పించామన్నారు. కానీ కూటమి నాయకులు ఇలాంటి పనులపై దృష్టి పెట్టకుండా విపక్షంపై కక్ష సాధించేందుకే పని చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంవీ పద్మావతి, అంబటి శ్రీనివాసరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, గేదెల పురుషోత్తం పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన కృష్ణదాస్
వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
Comments
Please login to add a commentAdd a comment