కాలువంతా నిర్లక్ష్యమే
పొందూరు: అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. రబీకి ముందే బాగు చేయాల్సిన కాలువలను పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలో గోకర్నపల్లి నుంచి కనిమెట్ట వరకు నా రాయణపురం కుడి కాలువ విస్తరించి ఉంది. కాలువలో షిల్టు, పూడికలు పేరుకుపోయాయి. దీంతో నీరు పారేటప్పుడు ఓవర్ ఫ్లో అవుతోంది. తక్కువ నీరు వచ్చేటపుపడు పొలాల్లోకి నీరు చేరకుండా షిల్టు, పూడికలు అడ్డుకుంటున్నాయి. వర్షాకాలంలో తూతూ మంత్రంగా పనులు చేయిస్తుండటంతో ఎక్కడి పూడికలు అక్కడే ఉన్నాయి. అవసరమైన సమయంలో పనులు చేయకపోవడంతో అవసరం లేని సమయంలో పొలాల్లోకి నీరు చేరుతుంది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బ తిని రైతులు నష్టాల్లో మునుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment