రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తెలకు గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై స్కూటీపై వెళ్తుండగా శుక్రవారం కారు ఢీ కొట్టటంతో తల్లీకుమార్తెలు యతిరాజుల చంద్రకళ, కుమార్తె మౌనిక గాయపడ్డారు. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస నవోదయ పాఠశాలలో కుమార్తె 10వ తరగతి చదువుతోంది. ఆమెను స్వగ్రామం కేశవరావుపేటకు తీసుకువచ్చేందుకు తల్లి స్కూటీపై వెళ్లింది. ఇద్దరూ బండిపై వస్తుండగా నవభారత్ నుంచి కింతలి మిల్లు వైపు సర్వీస్ రోడ్డుపై నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే క్రమంలో కొయ్యరాళ్లు కూడలి సమీపంలో కారు వీరి బండిని ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో తల్లీకుమార్తెలు రోడ్డుపై పడిపోయారు. ఇద్దరికీ చిన్న దెబ్బలే తగలడంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు ముందు నంబర్ ప్లేట్ రోడ్డుపై పడిపోవటంతో ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌కు వాట్సాప్‌లో స్థానిక ప్రయాణికులు ఫొటో పంపించారు. అనంతరం 108లో శ్రీకాకుళం రిమ్స్‌లో క్షతగాత్రులు చేరారు. శ్రీకాకుళం సమీపంలో ఢీ కొట్టిన వాహనాన్ని గుర్తించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment