శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు.. జిల్లాలోని నిర్దే శించిన మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూళ్లలో టీచర్ల పదోన్నతుల సీనియారిటీ జాబితా డీఈఓ అధికారిక వెబ్‌సైట్‌లో సిద్ధంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య తెలిపా రు. జిల్లాలోని ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలు, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాల సహాయకుల పోస్టుల కోసం అర్హులైన ఎస్‌జీటీలు, తత్సమానమైన కేడర్ కలిగిన ఉపాధ్యాయుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్టు చెప్పారు. జాబితాపై అభ్యంతరాలుంటే..ఈనెల 23వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని డీఈఓ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment