ఇంగ్లిష్‌లో మాట్లాడడం నేర్చుకున్న బిడ్డను చూసి నాడు సామాన్యుడు ఉప్పొంగిపోయాడు.
ఆ ఆనందం ఇప్పుడు దూరమవుతోంది..
రూపాయి ఖర్చు లేకుండా పిల్లల చేతికి అందిన ఖరీదైన ట్యాబులు చూసి పేదలు మురిసిపోయారు.
ఆ సంబరం ఇప్పుడు లేకుండాపోయింది..
ప్రభుత్వ బడుల్లో శిథిల గదులకు నాడు–నేడు కొత్త ఊపిరి పోసింది..
ఆ చొరవ ఇప్పుడు కనిపించడం లేదు.
పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మ ఖాతాలో ఠంచనుగా డబ్బు పడేది..
మాటలు కోటలు దాటుతున్నా ఖాతాలో రూపాయి జమ కావడం లేదు..
ప్రభుత్వ విద్యావ్యవస్థ గతమెన్నడూ చూడని విధంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అపురూప సంస్కరణలు ప్రవేశపెట్టారు. కానీ ఆ పథకాలకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. ఉత్త మాటలు చెబుతూ సామాన్యుల బిడ్డల చదువులను వెక్కిరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment