సీసీడబ్ల్యూఎస్ డైరెక్టర్‌గా లోహిత్
పలాస: మండలంలో బొడ్డపాడు గ్రామానికి చెందిన తామాడ లోహిత్ అండమాన్‌లోని సీసీడబ్ల్యూఎస్ ప్రభుత్వ శాఖ డైరెక్టర్‌గా అత్యధిక మెజారిటీతో గెలిపొందాడు. బతుకు తెరువు కోసం వెళ్లి అక్కడ స్థిరపడి ఉద్యోగం చేస్తున్న ఆయనను అక్కడి ప్రజలు తమ అక్కున చేర్చుకున్నారు. ఈవిధంగా అతను ప్రజలకు తగిన సేవలను అందించాలని అండమాన్‌లోని బొడ్డపాడు యువజన సేవా సంఘం అభినందనలు తెలిపింది. అలాగే తెలుగు యువత పలాస మండల శాఖ అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు, బొడ్డపాడు గ్రామ పెద్దలు, ప్రజలు కూడా అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment