కోట్లు
రూ.
5
కూటమి ప్రభుత్వానికి మందుబాబులు ఫుల్ కిక్ ఇచ్చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక్కరోజులోనే జిల్లావ్యాప్తంగా రూ.5 కోట్ల విలువైన మద్యం తాగేశారు. డిసెంబరు 31న(ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు) విపరీతంగా మద్యం అమ్మకాలు సాగాయని జిల్లా ఎకై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు బుధవారం వెల్లడించారు. డిసెంబరు 31 ఒక్కరోజే 6984 మద్యం బాటిళ్ల కేసులు, 2621 బీరు కేసులు అమ్ముడయ్యాయని వీటి విలువ రూ.5,00,46,264.68గా వెల్లడించారు. అయితే గతంతో పోల్చితే (మద్యం బాటిళ్లు ధర విలువ తగ్గడంతో) కాస్త ఆదాయం తగ్గినట్లేనని చెప్పారు. 2023 డిసెంబరు 31వ తేదీన 5,597 మద్యం బాటిళ్లు కేసులు, 2,329 బీరు కేసులు అమ్మకాలు జరగగా రూ. 5,12,21,367 ఆదాయం వచ్చిందన్నారు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు సమయం ఉండటంతో నూతన సంవత్సరం రోజున మద్యం అమ్మకాలు ఎంత జరిగాయన్నది తెలియాల్సి ఉంది. – శ్రీకాకుళం క్రైమ్
Comments
Please login to add a commentAdd a comment