ఆ నేత్రాలు సజీవం
ఎచ్చెర్ల : శ్రీకాకుళం జిల్లా పరిషత్ వద్ద నివాసముంటున్న లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన పేకల శ్రీరామ్మూర్తి (88) అనారోగ్యం కారణంగా మృతిచెందడంతో నేత్రదానం చేసేందుకు కుటుంబ సభ్యులు పేకల లక్ష్మణరావు, హేమసుందర్, పి.తేజేశ్వరరావు (సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి) ముందుకొచ్చారు. విషయాన్ని రెడ్‌క్రాస్‌కు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్‌నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, సహాయకులు నంది ఉమాశంకర్‌ల ద్వారా శ్రీరామ్మూర్తి కార్నియాలను సేకరించి విశాఖపట్నం ఎల్‌వీ ప్రసాద్ నేత్ర సేకరణా కేంద్రానికి అందజేశారు.ఈ సందర్భంగా దాత కుటుంబసభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు బుధవారం అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.
రాష్ట్ర టెన్నికాయిట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కాశీబుగ్గ : పలాస క్రీడా మైదానంలో బుధవారం రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలకు జిల్లా జట్టు ఎంపికలు ఆద్యంతం ఉత్సాహంగా జరిగాయి. బాలురు విభాగంలో పి.జగదీష్ బెహరా, బి.ఉదయ్, బి.సిద్ధార్థ, కె.ప్రవీణ్‌కుమార్, స్టాండ్‌బైగా కె.జయంత్, టి.వెంకటేష్ ఎంపికయ్యారు. బాలికల విభాగంలో పి.శ్రావణిపాత్రో, వై.వరలక్ష్మి, కె.వసుంధర, ఎన్.దివ్య, స్టాండ్‌బైగా పి.కావ్యశ్రీ, డి.రమ్య ఎంపికయ్యారు. ఎంపికై న వారంతా ఇదే క్రీడా మైదానంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర టెన్నికాయిట్ సంఘ కోశాధికారి పట్ట తవిటయ్య చెప్పారు. కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు బొండాడ తిరుమల, దామోదర, తారకేశ్వరరావు, మణికంఠ, దిలీప్, రాష్ట్ర అథ్లెటిక్స్ చైర్మన్ హరిబాబు, జిల్లా టెన్నికాయిట్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మల్లా సంతోష్‌కుమార్, జోగారావు, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం టి.చిట్టిబాబు, క్రీడా ప్రోత్సాహకుడు మల్లా భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజుల్లో 397 మంది ఎంపిక
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ఆర్మ్‌డు రిజర్వు మైదానంలో పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక గత నెల 30, 31 తేదీల్లో జరగగా.. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం సెలవు ప్రకటించారు. గురువారం నుంచి ఎంపికలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు సెలవు దినాల్లో మినహా ఎంపికలు నిర్వహిస్తారు. ఇప్పటి వరకు జరిగిన ఎంపికల్లో 1199 మందికి గాను 731 మంది హాజరయ్యారు. వీరిలో 397 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. అభ్యర్థులకు ఛాతీ కొలత, ఎత్తు, లాంగ్ జంప్, 1600 మీటర్లు, 100 మీటర్లు పరుగు పోటీ నిర్వహిస్తున్నారు. షెడ్యూల్ మేరకు విద్యార్థులు హాజరుకావాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవుపలికారు. ఇటువంటి వారి సమాచారం తెలిస్తే 6309990800, 6309990911 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. పూర్తిస్థాయి ప్రతిభ ఆధారంగా ఎంపికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment