బకాయిలు విడుదల చేయాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కి వినతి పత్రం అందజేశారు. 12వ పీఆర్‌సీ కమిషన్ తక్షణం ఏర్పాటు చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీజేఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, పీఆర్సీ, సీపీఎస్ ఉద్యోగుల బకాయిలు మొత్తం 32 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు 57 ప్రాప్తికి 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులను పాత పెన్షన్ పరిధిలోకి తీసుకురావాలని, ఇటీవల ఎన్నికల్లో పాల్గొన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు డ్యూటీ సర్టిఫికెట్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగుల, ఉపాధ్యాయుల బకాయి ల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరారు. జేసీని కలిసిన వారిలో రాష్ట్ర కార్యదర్శి కిశోర్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, జిల్లా కోశాధికారి బి.రవికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చౌదరి రవీంద్ర, జిల్లా కార్యదర్శులు పి.సూర్యప్రకాశరావు, జి.సురేష్ పి.బాబూరావు, జిల్లా నాయకులు ఎల్.కోదండరామయ్య, కె.సురేష్ కుమార్, టి.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్కూల్‌గేమ్స్ పోటీలకు నలుగురు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిష్టాత్మక ఆలిండియా స్కూల్‌గేమ్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి రికార్డుస్థాయిలో నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు మహారాష్ట్రలోని జలగం వేదికగా జరగనున్నాయి. జిల్లా నుంచి ఎంపికై నవారిలో మెట్ట అఖిల్ (కేశవరావుపేట), ఎతురాజుల లక్ష్మిప్రసాద్ (కేశవరావుపేట), ఎతురాజుల పవన్ (కేవవరావుపేట), తియ్యల లావణ్య (ఇప్పిలి) ఉన్నారు. వీరు నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలబాలికల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరిని మంగళవారం జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తన ఛాంబర్‌లో అభినందించారు. జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్లను విజయపథంలో నిలపాలని ఆకాంక్షించారు. వీరిని తీర్చిదిద్దుతున్న పీడీలు, శిక్షకులు, సాఫ్ట్‌బాల్ సంఘ బాధ్యులను మెచ్చుకున్నారు. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, మొజ్జాడ వెంకటరమణ, బీవీ రమణ, ఎం.సాంబమూర్తి, మల్లేసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment